Monday, October 20, 2025
HomeUncategorizedHyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

 

Vartha nethram Telugu | Updated: 27 Nov 2019, 05:38:31 PM

దక్షిణాదిలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎంపీ కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశమేం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి.

 

కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయమై వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే యోచన కేంద్రానికి లేదన్నారు. కానీ అంతకు ముందు మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో.. దేశానికి హైదరాబాద్‌ రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page