
వార్త నేత్రం ప్రతినిధి
17 అక్టోబర్ 2025
క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నాం: ఆశన్న అలియాస్ రూపేష్
* క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేష్ అన్నారు
* లొంగిపోయే ముందు భావోద్వేగ సందేశం ఇచ్చారు
* తమ సహచరుల్లో కొందరు ఇంకా పోరాడాలని అనుకుంటున్నారని చెప్పారు
* మన భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సహచరులను కోరుతున్నానని తెలిపారు
* ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరమని, సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు
* అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగుబాటులో తనతోపాటు చేరేవారు సంప్రదించాలని ఆశన్న పిలుపునిచ్చారు
* అంతకుముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేష్ జనజీవన స్రవంతిలో కలిశారు
* ముగ్గురు డివిజన్ కార్యదర్శులు, ఐదుగురు దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు, 20 మంది DVC సభ్యులుసహా 169 మంది పోలీసుల ముందు లొంగిపోయారు
* నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో జగదల్ పూర్‌లో అధికారికంగా లొంగిపోనున్నారు
* 70కి పైగా ఆయుధాలు అప్పగించనున్నట్లు సమాచారం
* ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆశన్న ఐటీఐ, పాలిటెక్నిక్ చదివారు
* 1991లో పీపుల్స్‌వార్ పార్టీలో చేరిన ఆశన్న, 1999లో పీపుల్స్‌వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు
* అదే ఏడాది హైదరాబాద్‌లో IPS అధికారి ఉమేశ్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్‌కు ఆయనే నేతృత్వం వహించినట్లు ప్రచారంలో ఉంది
* 2000 సంవత్సరంలో AP హోంమంత్రి ఎ.మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చేసి చంపేయడం, 2003లో అలిపిరిలో CM చంద్రబాబు కాన్వాయ్‌ను క్లెమోర్ మైన్‌తో పేల్చి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన దుశ్చర్యలలో ఆశన్న పేరు విస్తృతంగా ప్రచారమైంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.