వార్త నేత్రం :న్యూస్ ప్రతినిది
అల్లం ప్రతి ఇంట్లో వాడతారు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారంలో మసాలాగా మాత్రమే కాకుండా టీ, డికాక్షన్, ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అల్లం వివిధ ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో వాపు, మంట లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, వికారాన్ని తగ్గించే శక్తి పుష్కలంగా ఉంటుంది. షుగరు నియంత్రణలోనూ మేలు చేస్తుంది. అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, జీర్ణాశయం నుంచి ఆహారం వేగంగా కదలడానికి సహాయపడుతుంది. దీంతో, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే, గర్భధారణ సమయంలో వచ్చే ఉదయపు వికారం, ప్రయాణంలో వచ్చే మోషన్ సిక్‌నెస్, కీమోథెరపీ తర్వాత వచ్చే వికారాన్ని తగ్గించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో జింజెరోల్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయని, ఇవి బాడీ పెయిన్స్, వాపును తగ్గిస్తాయి. నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. Also Read రుషికొండ భవనాల వినియోగం పై కీలక నిర్ణయం, ఇక..!! రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, డయాబెటిస్ ఉన్నవారిలో మొత్తం గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు వెల్లడించారు. గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపరుస్తుంది. అల్లం మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, వయస్సు సంబంధిత అభిజ్ఞా క్షీణత నుంచి కాపాడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెరుగైన జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అల్లం సాధారణంగా చాలా మందికి సురక్షితమే అయినప్పటికీ, కొన్ని మందులు వాడేవారికి లేదా లేదా నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తుల విషయంలో మాత్రం వైద్యుల సూచనల మేరకు వినియోగించాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.