వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:మే20
నిత్యం కట్టుదిట్టమైన భద్రతలో ఉండే రాజ్ భవన్ లోనే చేతివాటం చూపించాడు ఓ జాదు గాడు, హైదరాబాద్ నడి ఒడ్డున గల తెలంగాణ అధికారిక నివాసం రాజ్ భవన్ లో కొద్ది రోజుల క్రితం ఈ దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది, ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రంలో సంచ లనం చోటుచేసుకుంది..
గవర్నర్ అధికార నివాసం లోకి దర్జాగా వెళ్లిన ఓ వ్యక్తి.. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్ లోకి చొరబడి నాలుగు హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు.ఈ నెల 13న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో కొన్ని కంప్యూటర్ల నుంచి నాలుగు హార్డ్ డిస్కులు కనిపించకుండా పోయిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.
దీనిపై వారు వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రత ఉండే ప్రదేశంలో ఈ తరహా ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది,రాజ్‌భవన్‌లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేసే శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది.
అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హార్డ్ డిస్కులలో ఏ విధమైన సమాచారం ఉందనే విష యంపై స్పష్టత రావాల్సి ఉంది.
Discover more from varthanethram.com
Subscribe to get the latest posts sent to your email.