వార్త నేత్రం :న్యూస్ ప్రతినిది
October 11, 2025,
బొల్లి మచ్చలు అనేది చర్మ వ్యాధి. చర్మం కొన్నిచోట్ల సహజ రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీనినే చాలామంది తెల్లపొడ, బొల్లి, విటిలిగో అనే పేర్లతో పిలుస్తారు. కొందరికి అక్కడక్కడా ఉంటాయి. మరికొందరికి శరీరమంతా విస్తరిస్తుంటాయి. ఈ మచ్చల కారణంగా చాలామంది బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అసౌకర్యంగా భావిస్తుంటారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అయితే బొల్లి రావడానికి వివిధ కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో బొల్లి వ్యాధికి ఆధునిక వైద్యరంగంలో ఓ అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స వల్ల శరీరంపై ఉండే తెల్లటి మచ్చలను కనిపించకుండా చేసుకోవచ్చని అంటున్నారు. బొల్లి మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. ఈ మచ్చలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణంగా.. మరికొంత మందిలో వంశపారంపర్యంగా వస్తాయని వివరిస్తున్నారు. అయితే ఈ మచ్చలు శరీరంపై ఏర్పడితే తగిన చికిత్స తీసుకోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు. మరిన్ని కనుగొనండి లైఫ్ స్టైల్ ఉత్పత్తులు కొనండి స్మార్ట్‌ఫోన్ ధరలు సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్ ఫ్యాషన్ వస్తువులు కొనండి “బాగా పాలిష్ పెట్టిన బియ్యంతో ఈ తీవ్రమైన వ్యాధి.. జాగ్రత్త!” మైక్రో పిగ్మెంటేషన్ చికిత్స ద్వారా బొల్లి మచ్చలను నివారించవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. మైక్రో పిగ్మెంటేషన్ అంటే, స్కాల్ప్ (తలకు) లేదా ఇతర చర్మ భాగాలకు చిన్న చిన్న చుక్కలుగా పిగ్మెంట్ ను నిక్షిప్తం చేసే ప్రక్రియ. పర్మనెంట్ లేదా సెమీ- పర్మనెంట్ కాస్మెటిక్ ప్రక్రియగా దీన్ని అభివర్ణిస్తారు. సాధారణంగా దీన్ని కనుబొమ్మలు, కనురెప్పలు, పెదవులు, జుట్టు రాలిన చోట ట్రీట్ మెంట్ చేస్తారు. అలాగే తెల్ల మచ్చలు ఉన్నచోట చికిత్స అందిస్తారు. ఇలా చేయడం వల్ల బొల్లి మచ్చలతో బాధపడేవారిలో కొంత వరకు ఆత్మవిశ్వాసం, నమ్మకం కలుగుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.