Monday, October 20, 2025
Homeరాశి ఫలాలునేటి రాశి ఫలితాలు

నేటి రాశి ఫలితాలు

  12-10-2025 ‌ఆదివారం
   *🌷రాశి ఫలితాలు🌷*
—————————————
మేషం

బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు.  ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. స్తిరస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి.
—————————————
వృషభం

వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయ అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————
మిధునం

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి.
—————————————
కర్కాటకం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి.
—————————————
సింహం

నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది.
—————————————
కన్య

ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు.
—————————————
తుల

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
—————————————
వృశ్చికం

వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీహోదా పెరుగుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.
—————————————
ధనస్సు

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి.
—————————————
మకరం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.  నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
—————————————
కుంభం

ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.
—————————————
మీనం

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందింతాయి.
—————————————


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page