వార్త నేత్రం : న్యూస్
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా గుండె జబ్బులు అధికం అయ్యాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉరుకుల పరుగుల జీవితం కావడంతో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే అనేక మందికి గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండె పోటు వచ్చే ముందు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, తల తిరిగినట్లుగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. అయితే ఈ మధ్య కాలంలో నిద్రలోనే గుండెపోటుతో చాలామంది అకాల మరణం చెందుతున్నారు. చాలామందికి నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆ విషయం కుటుంబ సభ్యులకు చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు ఆరోగ్యకరమైన నిద్రతో గుండె పదిలంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నా నిద్రలో వచ్చే గుండెపోటు ఇప్పుడు పెను సమస్యగా మారింది. నిద్రలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా గుండె పని చేస్తుందనేది మనకు తెలిసిందే. అయితే గుండె లయ తప్పడం, గుండెలోని ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు లాంటి సమస్యల కారణంగా నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. “ఫోన్ బెడ్ మీదే పెట్టుకుని పడుకుంటున్నారా? తీవ్ర హెచ్చరిక!” అలాగే నిద్రపోయే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందంటున్నారు. నిద్ర పోయే ముందు డీప్ బ్రీతింగ్ సాధన చేయడానికి 4-7-8 రూల్ను పాటించాలని వైద్యులు వివరిస్తున్నారు. అంటే 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం, 7 సెకన్ల పాటు శ్వాసను అలాగే బంధించడం.. 8 సెకన్లు పాటు శ్వాసను వదిలిపెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రూల్ను క్రమం తప్పకుండా పాటించడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.